నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను
naa devudae naaku praana snehitudu
naa devudae naaku maarga darshakudu
naa devudae naaku nitya poshakudu
naa devudae naaku jeevana daayakudu
gathi leni nannu vedhakina - athi kaankshaneeyudaayane
mithileni prema choopina - ravi koti thejudaayane
shramalalo.. naa todugaa.. nannu nadipinchenu
naa needagaa vennantiyunna naa praananaathudu
maranapu sankellalanu nannu vidipinchenu
naa bandhakaalanni tenchi vesina naa neethi sooryudu
kshanamaina maruvani veedani naa kshema shikharamu
kshamiyinchi naaku andinchenu ee rakshanaanandamu
kshayamainaa bratuku maarchi akshayathanosagenu
vaakyamae naa jeevamai nannu bratikinchenu
naa paadamulaku chiru deepamainaa naa divya thejamu
aatmayae paripoornamai nannu balaparachenu
naa adugu jaadalanu sthiramu chesina naa jeeva maargamu
naa gamyamemitto theliyaka naa parugu aagipoga
naa cheyi patti nanu nadipina naa maargadarshi yaese
viluvaina prema naapai niluvella kurisenu
Click a stanza to preview here.