సాగిపోదును – ఆగిపోను నేను
విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ
ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను
నా సహాయకుడు – నా కాపరి యేసే
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ
పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా – నేను భయపడను
నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ
పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం
నాకు కేడెము – నా కోటయు యేసే
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ
Saagipodunu – aagiponu nenu
Vishwasamulo nenu – praarthana lo nēdu
Halleluya halleluya – halleluya halleluya
Endina edari loylalo – nenu nadichinanu
Konda guhalalo – beedulalo nenu tiriginanu
Naa sahaayakudu – naa kaapari Yesē
Halleluya halleluya – halleluya halleluya
Pagalenda debbakinanu – raatri vela bhaymukaina
Pagavaani baanamulakaina – nenu bhayapadanu
Naaku aashrayamu – naa praanamu Yesē
Halleluya halleluya – halleluya halleluya
Padivēla mandi paibadina – padilamugaane nundēdanu
Prabhu Yesu sannidhaaname – naaku aadhaaram
Naaku kedemu – naa kotayu Yesē
Halleluya halleluya – halleluya halleluya
Click a stanza to preview here.