సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో
తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు
ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా
జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు
Sajeeva saakshulugaa mammu nilipina Devaa vandanam
Nee chittamandu sthiraparachinaavu Yesu abhivandanam
Emichchi nee runam teerchagalamu
Jihvaa phalamu arpinthumu
Memunnaam nee chittamulo
Memunnaam nee sevalo
Thalli garbhamunandu – mammunu roopinchi
Shaashwatha prematho memu nimpi
Bhuvini samakoorchinaavu
Egisipade alalenno – anachivesi jayamichchinaavu
Bheekaramaina tuphanu lona – nemmadinichchi brathikinchaavu
Krungipomu memennadu
Otami raadu maakennadu
Unnata pilupuku mammu pilichina – nee divya sankalpam
Neraverchumu maa parishuddha Devaa – mahima poornudaa
Jadivaanalainaa sudigaalulainaa – kaadini mosthoo saagedam
Nindalainaa baadhalainaa – aanandamutho paadedam
Kalatha chendamu memennadu
Alasata raadu maakennadu
Click a stanza to preview here.