సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు
తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును
ఆయనను స్తుతియించుడి
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు
ఆయనను స్తుతియించుడి
మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి
ఆయనను స్తుతియించుడి
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు
ఆయనను స్తుతియించుడి
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట
ఆయనను స్తుతియించుడి
Samasta janulaaraa meeru
Yehovaaku stutigaanamu paadi
Santoshhamutho sannidhilō
Utsaahinchudi jayam anuchu
Taaneyonarchē mahakaaryamulan
Paapini rakshimpa baliyaayen
Shatruni raajyamunu kooladrosenu
Smariyinchudi meerandharunu
Aayananu stutiyinchudi
Gnaapakamunchukō Israayēlu
Vidipinche Naigupthunundi
Naluvadi vatsaramulu nadipinche
Kaanaanuku mimmu chērchutaku
Aayananu stutiyinchudi
Mōshēku tana sēvanu nosage
Yehōshuvaa jayamunu pondē
Shatruni gelichi raajyamunu pondē
Ghanakaaryamulanu smariyinchi
Aayananu stutiyinchudi
Meerē prabhuni swantha prajalugaa
Kone mimmu tana rakthamutho
Aathmalu chērchi sanghamu katte
Aa reethini kani smariyinchu
Aayananu stutiyinchudi
Pilichenu prabhuvu sēvaku mimmu
Nēdē vinumaayana swaramu
Arpinchudi mee jeevithamulanu
Saagilapadi aayana yeduta
Aayananu stutiyinchudi
Click a stanza to preview here.