సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే
ప్రవహించె రక్త ధార నీ కోసమ
కడు ఘోర హింసనొందె నీ కోసమే
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
Sandehamele sanshayamadel
Prabhu Yesu gayamulanu parikinchi choodu
Gayalalo nee vrelu taakinchi choodu
Aa mulla makutamu neekai – dhariyichené
Nee paapa shikshanu taane – bhariyichené
Pravahichené rakta dhaara nee kosam
Kadu ghora hinsanondé nee kosamé
Endaka Yesuni neevu – eragananduvu
Endaka hrudayamu bayata – nilavamanduvu
Yesayya prema neeku lokuvayena
Yesayya siluva suvarta chulakanayena
Ee loka bhogamulanu – veedajaalava
Sataanu bandhakamandu – santasintuva
Yesayya sahanamuthone chelagatama
Eenadu rakshana dinam grahiyinchuma
Lokaan evvaru neekai – maranincharu
Nee shikshalu bhariyimpa – sahiyincharu
Nee talliyaina gani ninnu marachune
Aa prema moorthi ninnu maruvajaluna
Click a stanza to preview here.