సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము
Sannutintu Yesu Swāmi ninnu anudinam
Nī mahātya kāryamulanu pāḍi vivarinthunu
Śōdhana vēdana kaṣṭa samayāna – nā tōḍugā nunduvu
Āścarya kāryamulu ānanda ghaḍiyalu – ennadu maravanu
Samādhilōnundi nā prāṇamu vimōchinchiyunnāvu
Karuṇā kaṭākshamulu kirīṭamugā nākichchiyunnāvu
Nā dōshamulannitini kṣamiyinchināvu – karuṇa samr̥ddudavu
Mēlulato nā hr̥dayam tr̥ptiparachāvu – nīkēmi chellinthunu
Mahimaiśvaryamula Mahārāju mahimatō nimpunu
Śānti rājya sthāpakudu tana śānti nichchunu
Adigina vārikī kādanakunda varamulu kuripinchunu
Yēsayya nī goppa nāmamu smariyimpa – nākento bhāgyamu
Click a stanza to preview here.