సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
ప్రభుని నామమును ప్రబల పరచెదం
ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు
స్తుతి మహిమలు సదా అర్పించెదం
అతి సుందరుడు మహిమైశ్వరుడు
ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు
అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు
అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు
సంతోషించుమా ఆనందించుమా
ఆయన చేసినవి మరువకుమా
సన్నుతించుమా మహిమ పరచుమా
ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు
శోధన వేదన ఏది ఎదురైనా
మొరపెడితే చాలునే విడిపిస్తాడే
రక్షకుడేసు రక్షిస్తాడు
ఆయన నామములో జయం మనదే
ఇమ్మానుయేలు మనలో ఉండగా
జీవితమంతా ధన్యమే ధన్యమే
Sarva lokamā stuti geetham pādedam
Prabhuni nāmamunu prabala parachēdam
Āshcharyakarudu adbhutakarudu
Stuti mahimalu sadā arpinchēdam
Ati sundarudu mahimaiswarudu
Āyana nāmamunu keertinchēdam ellappudu
Anni kālamulalō unnāḍu untāḍu
Anni sthiti gatulalō nadipistāḍu
Santhōshin̄cumā ānandhin̄cumā
Āyana chēsina avi maruvakumā
Sannutin̄cumā mahima parachumā
Āyana nāmamunu ghanaparachu ellappudu
Shōdhana vēdana ēdi edurainā
Morapedite chālune vidipistāḍē
Rakshakuḍesu rakshistāḍu
Āyana nāmamulō jayam manadē
Immanuel manalō undaga
Jeevithamantaa dhanyamē dhanyamē
Click a stanza to preview here.