సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
Sarva yugamulalō sajīvudavu
Saripōlchagalnā nī sāmardhyamunu
Koniyāḍadaginadi nī divya tējam
Nā dhyānam nā prāṇam nīvē Yēsayyā
Prēmatō prāṇamunu arpinchināvu
Śramala sankellaina śatravunu karuṇinchuvāḍavu nīvē
Śūrulu nī yeduṭa vīrulu kārennaḍu
Jagatini jayinchina jayaśīluḍā
Stutulutō durgamunu sthāpinchuvāḍavu
Śṛṅga dhvanulatō sainyamunu naḍipinchuvāḍavu nīvē
Nī yandu dhairyamu nē pondukonedanu
Maraṇamu gelichina bahu dhīruḍā
Kṛpalatō rājyamunu sthiraparachu nīvu
Bahu taramulaku śōbhātiśayamugā chēsitivī nannu
Nemmadi kaliginchē nī bāhubalamatō
Śatruvu naṇachina bahu śūruḍā
Click a stanza to preview here.