శక్తి చేత కాదు బలము చేత కాదు
దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము
నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి
తన రూపులో తన పోలికలో
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి
కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు
అగ్ని గుండములో మరణ శాసనములో
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా
ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ
ప్రియమార నిన్నే పిలువంగ యేసు
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని
Shakthi chetha kaadu balamu chetha kaadu
Devuni Aathmache samasthamu saadhyamu
Noti maata dwaaraa ee sarva srushtini
Chesenu Devudu shoonyamu nundi
Tana roopulo tana polikalo
Nirminchenu Devudu naruni manti nundi
Krooramaina simhaala bonainanoo
Vishwaasamutho saagenu Daaneeyelu
Agni gundamulo marana shaasanamulo
Immaanuyelu Yesayya thodugaa
Ghoramaina paapaala baanisainanoo
Bhaaramaina brathukunu gaduputhunanoo
Priyamaara ninne piluvanga Yesu
Dari chera raavaa aa prema Naathuni
Click a stanza to preview here.