శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం వర్ణించలేను లెక్కించలేను నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు నాయెడల నీకున్న తలంపులు విస్తారం నీ కొరకే నేను జీవింతు ఇలలో నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి