శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
సత్రమందున పశువులశాల యందున
దేవపుత్రుండు మనుజుండాయెనందునా
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా
మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషములబోగొట్టెను
పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను
Shri Yesundu janminche reyilo
Nedu paayaka Bethlehem oorilo
Aa kanniya Mariyamma garbhamanduna
Immanuelanedi naamamanduna
Satramanduna pashuvula shaala yanduna
Devaputrundu manujundayenanduna
Patti potti guddalato chuttabadi (2)
Pashula tottilo parunda bettabadi
Gollalellaru migula bheetillaga
Delpe goppa vaartha dootha challaga
Mana korakokka shishuvu puttenu
Dharanu mana doshamulabogottenu
Paralokapu sainyambu goodenu
Minta vara rakshakuni goorchi paadenu
Akshayundagu Yesu puttenu
Manaku rakshanambu siddhaparachenu
Click a stanza to preview here.