స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
Stothrinthumu ninu maadu Thandri
Sathyamutho aathmatho eppudu
Parishuddha alankaaramulatho
Darshinchedamu sharanam sharanam
Shreshta eevula yoota neeve
Shreshta kumaaruni ichinanduna
Trithvamai ekatvamaina thri
Lokanatha sharanam sharanam
Davala varnudaa ratna varnudaa
Sathya roopi anabaduvadaa
Nanu rakshinchina rakshakundavu
Naatha neeve sharanam sharanam
Sanghamunaku shirassu neeve
Raajaa neeke namaskaaramulu
Mukhyamaina moola raayi
Kotlaku koladi sharanam sharanam
Needu sevakula punaadi
Gnaanamunaku minchina thelivi
Andamuganoo koodukonuchu
Vedukondumu sharanam sharanam
Raajaa neeke stuthi stothramulu
Geethamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nithyam
Hallelujah Amen Amen
Click a stanza to preview here.