స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
Sthutinchudi Yehova Devuni soorya chandrulaaraa
Pavithra dootagana senadhipathiki
Unnatha sthalamulalo Yehovaanu sthutinchudi ||Sthutinchudi||
Kaanthigala nakshathramulaaraa paramaakaashamaa
Aakaashajalamaa aaviri himamaa agni tuphanu
Mahaasamudra parvatha vruksha mrugamulu pashuvulaaraa
Prashamsinchudi phalavrukshamulu parama thandrini
Yehovaanu sthutinchudi ||Sthutinchudi||
Raajulu prajalu nyaayaadhipathulu adhipathulaaraa
Baaluru yauvana kanyakaa vruddhulu Prabhunuthinchudi
Praaku jeevulu paluvidha pakshulu paadi sthutinchudi
Prashamsinchudi prabhaava mahimalu parama thandrini
Yehovaanu sthutinchudi ||Sthutinchudi||
Click a stanza to preview here.