స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Stutiyinchi keerthinchi ghanaparathunu naa Yesayya
Neevē naa aaraadhanā Yesayya
Neevē naa stuti paathrudaa naa Yesayya
Neevē naa aatmalō aanandamayyā
Neevē naa jeevitha makarandamayyā
Gaadhaandhakaramulōna velugai nadipinchināvā
Agaadha jalamulōna maargamu choopin̄chināvā
Anudinamu mannaanu pampi
Prajalaṇu pōshinchināvā
Nee prajalaṇu pōshinchināvā
Agni gundamu nundi neevu vidipinchināvu
Simhapu noti nundi maranamu tappinchināvu
Prati kshanamu neevu todugā nundi
Prajalaṇu rakshin̄chināvu
Nee prajalaṇu rakshin̄chināvu
Paapamulō unna maakai raktamu chindināvē
Maranamulō unna maakai siluvālō maranin̄chināvē
Anudinamu maato neevundi
Mammu nadipinchu Devaa
Mamu paramuku nadipinchu Devaa
Click a stanza to preview here.