సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ
లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము
Sudhā madhura kiraṇāla aruṇōdayam
Karunāmayuni sharaṇam aruṇōdayam
Tera marugu hṛdayālu velugainavi
Maranāla cerasāla marugainadi
Divi rājugā bhuviki diginādani – ravi rājugā ilanu migilādani
Navalōka gaganālu pilichādani – paralōka bhavanālu terichādani
Ārani jīvana jyōtiga velige tārokatochindi
Pāḍē pāṭala paśuvulaśālanū ūyala chēsindi
Ninu pāvagā – nirupēdagā – janminchagā – ila paṇḍuga
Lōkālalō pāpa śōkālalō – ēcākilā bratuku avivēkulu
Kṣama hṛdaya sahanālu samapāluga – prēmānurāgālu sthira āstiga
Namminavārini rammane pilichē rakṣakuḍā Yēsē
Nitya sukhāla jīvajalāla pennidhi ā prabhuvē
Ā janmamē – oka marmamu – ā bandhamē – anubandhamu
Click a stanza to preview here.