సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును
నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
Sudūramu ī payanamu mundu iruku mārgamu Yesu nāku tōḍugā nātonē naḍucchuṇḍagā Nē ventha vellēdha nā rāju vembadi Sumadhura bhāgyamu yesutō payanamu
Alalapai nē naḍichedā tufānulō hushārugā Ā ethulu ā lōthulu ā malupulu nē tirigedhā Ullāsamē… yesutō nā payanamanthayu Āścharyamainadi nē naḍuchu mārgamu Okokk adugulō ō krutha anubhavam