సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు
యేసులేని జీవితం వాడబారిన చరితం
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా?
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?
యేసులేని జీవితం అంధకార భందురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం
Sundaramaina dehaalennō shithilam kaaledaa?
Ambaramantina raajulendarō alisipōledaa?
Kalamulu pattina kavulu endarō kanumarugavaledaa?
Dharanilona dhanikulellaroo dahanam kaaledaa?
Edhi shaashvatam kaadedhi shaashvatam
Tarachi choodumu parikinchi choodamu
Neththuti chaaralanu likhinchina raajulendarō
Aa neththurulonē praanālu vidichipōyaaru
Adhikaara daahantō madamekkinā veerulu
Samaadhi lōthullōnē moogabōyāru
Tapōbalamu pondina r̥shulandaroo
Mathaadhikaarulu mathaadhipathulu
Ee kaalagarbhamlōnē kalasipōyāru
Marana pidikallō bandeelayyāru
Yesuleni jeevitham vaadabaarina charitham
Kreestu unna jeevitham bhuvilo charithaardham
Praanam posina daivanni kaadante
Aa jeevithaaniki paramaartham untundaa?
Paapa sankellalō bandeelainavāriki
Aa divya moksham cherukōnē bhaagyam untundaa?
Shareerānni vidichina manushyātmakū
Marō jeevitham ledhanuta bhaavyamaa?
Raktamu kaarchina Yesuni vismarinchi
Ee srushtini poojinchuta manishiki nyaayamaa?
Yesuleni jeevitham andhakāra bhanduram
Kreestu unna jeevitham tejōmaya mandiram
Click a stanza to preview here.