స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి అల్ఫా ఒమేగ తానే
ఆద్యంతము మన యేసే ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే లెక్క లేని యద్భుతముల్ మక్కువతో చేయువాడు
సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ మిక్కిలి ఆనందము కల్గెన్
నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో ప్రశస్త రత్నములతో ప్రవిమలముగా నిను గట్టెదను హిత వత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే
జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను – నీ తోడై యుండెదను నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిను కాల్చగ లేవు
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను – విడగొట్టెదను నేను అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను రహస్యములో మరుగైన ధనమును నీ కొసంగెదను
గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా ముదిమి వచ్చుఁ వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే
Swachchanda Siyoanu vaasi Sarvaadhikaari – Kasturi pooraasi Varthamaana bhootha bhavi-shyatkaala vaasi Alpha Omega taane
Aadyantamu mana Yeshe Idigo nenu oka nibandhanu Adbhutamuga jetun – nee prajalandari yeduta Parishodimpajalani maha – panulella prabhuve Lekka lena yadbuthamul Makuvatho cheyuvadu
Sangeetam naadamula thoda Siyonu puramu – sompuganu cheritimi Shashwatha santoshmu maa – shiramulapai velasen Dukhmu nitturpunu poyen Mikkili aanandamu kalgen
Neelamula punadulu vesi Neelaanjanamutholu – maanikya manutholu Suvarna shuniyamula – soorya kaanthamutho Prashasta ratnamultho Pravimalamuga ninnu gattedanu Hita vatsaramu vimukti Aathmaabhishekam nuide
Jalamulalo badi daatunappudu Balamai yundedanu – nee thodai yundedanu Nadulalo vellunappudu – nee pai paaravu Agni madhyanu nadachinanu Jwaalu ninnu kaalchaga ledu
Ittadi talupula bagula gotted Ninupa ghadiyalanu – vidagottedanu nenu Andhakara sthalamulalo nu-nnatti nidhulanu Rahasyamulo marugaina Dhanamunu nee kosangedanu
Garbhamu puttinadi modalu Thalli yodilona – koorchundina modalu Nenu chanka bettukonna – naadu prajalara Mudimi vachhu varaku ninnu Eththukonu vadanu nene
⬅
➡
Click a stanza to preview here.