స్వఛ్చంద సీయోను వాసి
సర్వాధికారి – కస్తూరి పూరాసి
వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి
అల్ఫా ఒమేగ తానే
ఆద్యంతము మన యేసే
ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే
లెక్క లేని యద్భుతముల్
మక్కువతో చేయువాడు
సంగీతం నాదముల తోడ
సీయోను పురము – సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్
దుఃఖము నిట్టూర్పును పోయెన్
మిక్కిలి ఆనందము కల్గెన్
నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో – మాణిక్య మణులతో
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో
ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగా నిను గట్టెదను
సుమముల హారము
సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే
హిత వత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీదే
జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను – నీ తోడై యుండెదను
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను
జ్వాలలు నిను కాల్చగ లేవు
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప ఘడియలను – విడగొట్టెదను నేను
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను
రహస్యములో మరుగైన
ధనమును నీ కొసంగెదను
గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను
ఎత్తుకొను వాడను నేనే
Swachchanda Siyonnu vaasi
Sarvaadhikaari – Kasturi pooraasi
Vartamaana bhoot bhavi-shyatkaala vaasi
Alpha Omega taane
Aadyantamu mana Yesae
Idigo nenu oka nibandhananu
Adbhutamuga jetun – Nee prajalandari yeduta
Parishodhipajalaani maha – panulella prabhuve
Lekka leni yadbhutamul
Makkuvatho cheyuvaadu
Sangeetam naadamul thoda
Siyonu puramu – sompuganu cheritimi
Shaashvata santoshamu maa – shiramulapai velasen
Dukhhamu nitturpunu poyen
Mikkili aanandamu kalgen
Neelamula punadulu vesi
Neelanjanamuthulo – manikya manuthulo
Suvarna shuniyamula – Surya kaanthamutho
Prashasta ratnamuthulo
Pravimalamuga ninu gattedanu
Sumamula haaramu
Santoshānanda tailamu neede – stuti vastramu neede
Ullaasa vastrambu neede – vidudalaayi neede
Hita vatsaramu vimukti
Aathmaabhishekam neede
Jalamulalo badi daatunappudu
Balamai yundedanu – nee thodai yundedanu
Nadulalo vellunappudu – neepai paaravu
Agni madhyanu nadachinanu
Jwaalalu ninu kaalchaga levu
Ittadi talupula bagula gottedu
Ninupa ghadiyalanu – vidagothtedanu nenu
Andhakara sthalamulalo nu-nnatti nidhulanu
Rahasyamulo marugaina
Dhanamunu nee kosangedanu
Garbhamuna puttinadi modalu
Thalli yodilona – koorchundinadi modalu
Nenu chanka bettukonna – naadu prajalara
Mudimi vachhu varaku ninnu
Eththukonu vaadanu nene
Click a stanza to preview here.