దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ పాపమేమో మరణమును వెంట దెచ్చెగా ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా భయము లేదు మనకింకా ఓ సోదరీ అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా బంధకములు తెంపబడెగా ఓ సోదరీ సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా సందేహమేల సమయమిదే ఓ సోదరీ నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..
Sandehamela samayamide o sodaraa Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa Sandehamela samayamide o sodari Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa