తోడైవుంటే చాలును నీ కృప మాకు
కాచితివయ్యా నీడలో ఈ స్థితి వరకు
నీ కృపలేని క్షణము నే జీవించలేను
నీ దయలేని దినము నే బ్రతుకలేను
దేవా నీవే మా ఆశ్రయ దుర్గము
దేవా నీవే మా దీవెన హస్తము
దేవా నీవే మా ఉన్నత శిఖరము
దేవా నీవే మా శ్రమలలో విజయము
1.పర్వతాలు తొలగిపోవును మెట్టలు తత్తరిల్లును
నీ కృప మాత్రమే శాశ్వతకాలముండును
నీ కృపలోని క్షణము కాచును కలకాలము
నీ దయలోని దినము దీవెనకరము ||దేవా||
2. భూమి అంతరించిపోయిన
సృష్టి అంత సూన్యమైనను
నీ కృప మాత్రమే విశ్వమందు నిలిచిఉండును
నీ కృపలోని క్షణము కీర్తిని కలిగించును
నీ దయాలోని దినము దారి చూపించును ||దేవా||
3.
కన్నవారు దూరమైనను
స్నేహితులే విడచిపోయిన
నీ కృప మాత్రమే విడువక చేరదీయును
నీ కృప ఉంటె చాలు క్షేమమే వెంట వచ్చును
నీ దయ ఉంటె చాలు దీవెనలు ఫలించును ||దేవా||
Click a stanza to preview here.