ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది ఉత్సాహమైనది అది నీతో నడచుటయే కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2)
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి
కరుణే లేని కఠినుల మధ్య నన్నూ కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా కాపరి లేని జీవిత పయణంలోనా నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా నా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించి
నా మార్గం స్థిరపరిచావా – నా కోసం దిగి వచ్చి నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి
నలిగిన నా జీవిత పయణంలోనా నీ నవ్వును పుట్టించావా యేసయ్యా నూతనమైన జీవిత మార్గంలోనా నా పాదం నీతో నడిపించావా యేసయ్యా
నా కోసం ఏర్పరిచావా – పరలోకపు నివాసము నా కోసం తిరిగొస్తావా – నీ కోసం వేచుంటా నీవు నా కోసం తిరిగొస్తావా – నన్నూ ప్రేమించి నా జీవిత పయనం – నీతోనే యేసయ్యా