ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు
సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా
దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని
మన మెస్సయ్య పుట్టాడని
వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా
మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే
ఇల దిగి వచ్చె మనకోసమే
ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా
సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
Elo Elo Elo antu – vachaarandi gollalu
Santhoshale pongenandi – Hailessa
Daare choope devudochche – ullaasangaa ooru aade
Sangeethale paadalandhi – Hailessa
Andhakaaranni tholaginche mahaneyudu
Puttinaadandi Yesayya mana Devudu
Ninne kori – Ninne cheri
Itta rakshincha vachchadu Paramaathmudu
Lokaalanelleti raarajuraa – Udayinche sooride vachchaduraa
Aakaasha veedhi – meriseti daari – oka taara murisindiga
Duthaali paadi – kolichaaru choodu – ghanamaina oka veduka
Aa gollalegaa – daruveshe choodu – Messayya puttaadani
Mana Messayya puttaadani
Vennello poosindi o sandadi – palikindi oorantaa ee vishayam
Ee deenudanta – pasibaaludanta – velisaadu Maharajuga
Manasunnavaadu – daya choopuvaadu – alanaati anubandhame
Kanulaaraa choodu – manasaaraa vedu – digi vachche manakosame
Ila digi vachche manakosame
Aa ningi taarallaa velagaalira – jagamantha choosela brathakaalira
Veliginchu vaadu – manaloni vaadu – nilichaadu mana thoduga
Sali gaali raatri – pilisindi soodu – manalona oka pandaga
Bhayamela neeku – digulela neeku – Yesayya manakundagaa
Mana Yesayya manakundagaa
Click a stanza to preview here.