యేసయ్యా, త్రియేక దేవుడా, నా ప్రాణ నాథుడా, నన్ను కాపాడు వాడా..(2) నాలో వసియించువాడా, నన్ను నడిపించువాడా.. ఓఓ..
ఈ నా జీవితం నీవిచ్చిన వరం (2), నా ఆయుష్కాలమంతయు, నిను పొగడి పాడెదా (2) ఇక జీవించునది నేను కాదని, నాలోని క్రీస్తని నిన్నే పొగడి పాడెదా.. (2) నిన్నే సన్నుతించేదా, నిన్నే ఆరాధించేదా ... ఆఆఆఆ.. నాలో వసియించువాడా, నన్ను నడిపించువాడా.. ఓఓ.. ||యేసయ్యా
నా పాప భారము నా దోష శిక్షయు (2) నువు భరియించావని దేవా నిన్నే పొగడి పాడెదా (2) నా సిలువను మోసుకొని, ఉపేక్షించుకొని, నీ ప్రేమని ప్రకటిస్తూ నిన్నే పొగడి పాడెదా (2) నిన్నే సన్నుతించేదా, నిన్నే ఆరాధించేదా ... ఆఆఆఆ.. నాలో వసియించువాడా, నన్ను నడిపించువాడా.. ఓఓ.. || యేసయ్యా