యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము – సంతోషముగ నుందురు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ – యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Yesuni stutiyinchuvaaru – nitya jeevamu nondedaru
Anandamutho dinadinamu – santoshamuga unduru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya
Vadabarani aakuvale – dinadinamu balamondedaru
Jeevajalapu nadi yodduna – vrikshamulavale perigedaru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya
Cheekati nundi velugunaku – maranamu nundi jeevamuku
Cheyi viduvaka tanato kooda – Yese nadipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya
Cheeku chintalu kaligina nu – Cheralu dukhamu kaligina nu
Kanureppavale kaapadi – Yese vidipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya
Nadi sandramulo payaninchana – Natladavulalo nivasinchana
Ennadu maruvaka edabayaka – Yese todundunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya
Click a stanza to preview here.