యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం - పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
ముందుకే సాగెదం - వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం - ప్రభుని ప్రార్ధించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం
గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
విశ్వాసమే ఆయుధం - ప్రార్ధనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని - తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం
ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
బ్రతుకుట ప్రభు కోసమే - చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను - మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం
yuddha veerulam – parishuddha pourulam
yooda gothrapu simhapu muddu biddalam
kreestu vaaralam – paraloka vaasulam
vadhinchabadina gorrepilla prema daasulam
munduke saagedam – venuka thattu tirugamu
ee lokamulo uppu shilaga migalamu
melakuvaga undedam – prabhuni praardhinchedam
paralokamukai memu siddhapadedamu
jayamu jayamu hosanna jayamu jayamani
nooraara raarajuni keerthinchedam
jayamu jayamu hosanna jayamu jayamani
manasaara maha raajuni sevinshedam
garjinche apavaadi eduru nilachina
evarini mringuduna ani tirugulaadina
shodhanalu shatruvula chuttu muttina
paapamulo mammuna padadroya joochina
vishwaasame aayudham – praardhane maa balam
vaakyamane khadgamuto tharimi kottedam
silovalo saathaanuni – thalanu chithaka throkina
maa raaju yesulone jayamu pondedam
iha loka aashal enno mosaginchina
kreestu prema nundi vidadiya joochina
shramalu avamaanamule krungadeesina
balaheenathale mammuna bhanga parachina
brathukuta prabhu kosame – chaavaina laabhame
pandemandu opikatho poradedam
nithya jeevam ivvanu – maranamunu gelichina
mahima raaju kreestulone jayamu pondedam
Click a stanza to preview here.