Aa ningilona vinta taara velise Lyrics
ఆ నింగిలోన వింత తార వెలిసే
ఈ నేల చీకటంత పారిపోయే (2)
బెత్లహేము పురములోన
బాలుడేసు జన్మించినాడే
దూతలంతా క్రొత్త పాటపడే
పరలోకమంతా పరవశించిపోయే
పరిశుద్ధుడు పుట్టాడని
పాపిని కరుణించాడని
ప్రభుయేసే రారాజని
పారమును వీడి వచ్చాడని (2)
( ఆ నింగిలోన )
దేవాది దేవుడే దీనుడై
కన్య మరియకే పుట్టెనే
దావీదు పట్టణమందు నేడు
రక్షకుని మీరు చూతురని
దూతవార్త చాటిచెప్పేనే
ఆ గొల్లలే గానమాడి గంతులేసేనే
పశులపాకలో ప్రభువునే భక్తితో
పరవశించి పూజించేనే
పరలోక సైన్యసమూహమే
స్తోత్రగానమే చేసేరే
ప్రజలందరికి సమాధానమే
కలుగును గాకని పాడిరే
తుర్ఫు దిక్కు చుక్క చుసిరే
ఆ జ్ఞానులే బెత్లహేము తరలివచ్చెనే
బాలయేసు పాదచెంతనే
బంగారమే సాంబ్రాణి భోళమిచ్చెనే