ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం

అల్ఫయు నీవే ఒమేగయు నీవే
మార్గము నీవే – జీవము నీవే
పరలోక తెరపైట తొలగించగా

స్తుతి గీత పాటలు వినిపించగా
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా

www.christsquare.com