ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే

గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే

నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము

www.christsquare.com