ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా
నా కష్టాలలో ఆరాధన

శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన

ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన

యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన

రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన

www.christsquare.com