ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు
మోషే దేవుడు మాట్లాడే దేవుడు
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు