ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా