ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం

నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆనందమే

నాకేమి కావలెనో నేనేమి కోరెదనో
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే

కష్టాల కెరటాల సుడిగుండమందున
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి

www.christsquare.com