అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు

వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు
నక్షత్రములు రాలే రోజు

నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు

సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపం కలిగే రోజు

దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు

మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు
కోపాగ్ని రగిలే రోజు

పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు

వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు
అబద్ధికులు అరచే రోజు

దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు

పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై

అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు

ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా

ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు

www.christsquare.com