ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
ఇప్పుడును ఎల్లప్పుడును (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను – రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2)
నీవు లేకుండా కలిగున్నవేమియు (2)
కలుగలేదులే యేసు కలుగలేదులే (2)
జలముల మధ్య విశాలము కలిగినప్పుడు – ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2)
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి – ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2)
సూర్య చంద్ర నక్షత్రములన్ (2)
చేసితివి కలుగచేసితివి (2)
నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి – నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2)
పాప అపరాధములచేత చచ్చియుండగా (2)
భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2)