అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)

నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం

సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2)

కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2)

మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2)

www.christsquare.com