ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి
నీ సొగసును కోల్పోయినావా
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచావా