Rakshakuni Janmastalamaa Song Lyrics

రక్షకుని జన్మస్థలమా
యూదయ బెత్లహేమా
ఆరాధనలకు ఆరంభమా
హృదయార్పణలకు నివాసమా
ఎందుకో ఇంత భాగ్యము
దాచిఉంచే ప్రభు నీకోసము
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును

ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను
ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా
కాలము విడిపోయే రెండుగా

స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును

నోటి మాటతో సృష్టిని
తనచేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై
పవళించెను పశువుల పాకలో
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీ కిచ్చెను
యూదా ప్రధానులందరిలో
నీవు అల్పమైనదానవు కావు

స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును

దివిలోని దూతగణములు
సైన్య సమూహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి
స్తోత్ర గీతమే అర్పించిరి
సర్వలోక కల్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని
అర్భాటించి కీర్తించెనుగా

స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును

రక్షకునిచూడవచ్చిన
ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను
అగోచరుడైన యేసువార్తలు
సింహ స్వప్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి
సాటిలేరని కొలిచిరిగా

స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును

www.christsquare.com