అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా

ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను

జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను

నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను

నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే

www.christsquare.com