అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను

www.christsquare.com