అంత్యదినమందు దూత బూర నూదుచుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందు నచ్చటన్

నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్ నచ్చటన్

క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్

కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే
క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్
కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్

www.christsquare.com