అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము
దారి చూపే తార రారాజునే జేర
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు

www.christsquare.com