అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను

వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము

ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో

ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో

ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని

మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును

మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో

www.christsquare.com