అంజలి ఘటియింతు దేవా
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ
సిలువ మహా యజ్ఞ సింధూర

రక్తా రుణమేయ సంభావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ
పరలోక సింహాసనాసీన

తేజో విరాజమాన జగదావనా
దేవా దేవా యేసు దేవా
అంజలి ఘటియింతు దేవా

www.christsquare.com