అరుణ కాంతి కిరణమై
కరుణ చూప ధరణిపై
నరుని రూపు దాల్చెను
పరమ దేవ తనయుడు

అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్
ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్

యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు
పరిశుద్ధుని రక్తమునందే

పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే

పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు
పరిశుద్ధుని రక్తమునందే

www.christsquare.com