భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు

జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు
బబులోను దేశమందున

ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా

చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా

ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా

www.christsquare.com