చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నె చాటదా
పెనుగాలి రేగినా ప్రభూ
అది నిన్నె చూపదా
పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే
దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మెనో
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే
దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెగా
పదే పాడి నీ కృపలన్
నే వివరింతున్ నా యేసువా