చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు

మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి

నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప

నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు

దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి

www.christsquare.com