దేవా నన్నేల విడచినావయా
దేవా నన్నేల మరచినావయా
దీనుడను నేను దిక్కులేనివాడను
దయచూపి ఆదుకొనుమయా

అల్పుడను నేను - అనాధను నేను
దరిచేరి ఆదరించుమయా…
దేవా నాదేవా - నా యేసయా (2)

ఎన్నో ఆశలతో - జీవించుచుండగా
అంతా నావారేనని - నమ్మియుండగా
ప్రేమించినవారే -నను మోసగించి
నే నమ్మినవారే - నా చేయి విడచి (2)
ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని (2)

నా జీవితం - సుడిగుండాలవలయం
ఉహించనిమలుపులే - నిత్య ప్రాప్తము (2)
అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ
అందరు విడచిన - అనాధనైతిని (2)
చావలేక - బ్రతకలేక - కుములుచుంటిని (2)

దేవా… నాదేవా… నా… యేసయా (2)
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
దయచూపి ఆదుకొనుమయా

దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును (2)
చెయిచాపి ఆదరించుమయా….

www.christsquare.com