ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును
రానున్న కాలము – కలత నివ్వదు
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును

ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను
వెరవదెన్నడైనను నాదు హృదయము
గాయపడిన యేసుపాదం అందు నడచెను

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము

www.christsquare.com